16న భీమవరం వెళ్లేందుకు సన్నాహాలు

16న భీమవరం వెళ్లేందుకు  సన్నాహాలు

తాడేపల్లిగూడెం

ఈనెల 16వ తేదీ మంగళవారం భీమవరంలో జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు మేమంతా సిద్ధం అంటూ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. స్థానిక పార్టీ కార్యాలయంలో  డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. దీనికి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డుల నుంచి  నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ ఈ నెల 16 తేదీ మంగళవారం భీమవరంలో జరిగే సభకు తాడేపల్లిగూడెం నియోజవర్గం నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సభకు వచ్చే  వారందరినీ బస్సుల్లో బాధ్యతగా తీసుకువెళ్లి సభ అనంతరం తిరిగి వచ్చేవరకు సంబంధిత నాయకులు బాధ్యత వహించాలన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండవ విడత ప్రచారంలో తాడేపల్లిగూడెం ఉంటుందన్నారు. తాడేపల్లిగూడెం కి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు విలువైన అనేక ప్రాజెక్టులు మంజూరై టెండర్లు పిలిచి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీసుకువచ్చి వాటికి శంకుస్థాపనలు చేయించాలని తలపెట్టినప్పటికీ కోడ్ రావడంతో సాధ్యం కాలేదు అన్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభలో వాటిని ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గుండుబోగుల నాగు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గుండుమోగుల బలుసులరావు, వీర్ల గోవింద్, వన్ టౌన్ జెసిఎస్ కన్వీనర్ కొలుకులూరి ధర్మరాజు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రీ భాస్కరరావు, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు తెన్నేటి జగ్జీవన్, తాడేపల్లిగూడెం మండలం పార్టీ ప్రెసిడెంట్ జడ్డు హరిబాబు, పెంటపాడు మండలం పార్టీ ప్రెసిడెంట్ కైగాల శ్రీనివాస్, టౌన్ మహిళా ప్రెసిడెంట్ బోనం విజయనిర్మల, పెంటపాడు మండలం మహిళా ప్రెసిడెంట్ భావన ధాన్యలక్ష్మి, ముదునూరు సొసైటీ చైర్మన్ బూరాడ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎంపీపీ పునుకుమాటి శేషులత, పెంటపాడు మండలం యూత్ ప్రెసిడెంట్ కొవ్వూరి విజయ భాస్కర్ రెడ్డి, బొద్దాని శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. ఈ సమావేశానికి పలువురు సొసైటీలు చైర్మన్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు ఇన్చార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Tags:

About The Author

Related Posts