నల్ల రిబ్బన్లతో మౌన నిరసన

నల్ల రిబ్బన్లతో మౌన నిరసన

తాడేపల్లిగూడెం

 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. మే 13వ తేదీన జరిగే పోలింగ్ లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు చరమగీతం పాడతారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు, రోడ్ షోలకు, బహిరంగ సభలకు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న అభిమానం, ఆదరణ, స్పందనలను చూసి ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. ఏదో ఒకలాగా ఈ యాత్రను అడ్డుకోవాలని కుట్రపూరితంగా ఆలోచిస్తున్నాయన్నారు. ఆనాడు కోడి కత్తితో జగన్ పై దాడి చేయగా, నేడు రాయితో దాడి చేశారన్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా జగన్ ప్రాణానికి హాని తలపెట్టాలని ప్రతిపక్ష తెలుగుదేశం కుట్ర పన్నిందని మంత్రి కొట్టు ఆరోపించారు. చీకటిలో కూడా గురి తప్పకుండా రాయితో కొట్టగలిగారంటే అది ఖచ్చితంగా కుట్రపూరితంగా చేసిందేనని అర్థమవుతుందన్నారు.  చంద్రబాబు రాజకీయ జీవితం మొదట్నుంచి వెన్నుపోట్లు, హత్య రాజకీయాలు, కుళ్ళు కుట్ర, కుతంత్రాలతోనే నిండిపోయింది అన్నారు.మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందర రావు మాట్లాడుతూ జనాదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్ష తెలుగుదేశం ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ ,ముదునూరు సొసైటీ చైర్మన్  బూరాడ శ్రీనివాస్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కరరావు, తాడేపల్లిగూడెం మండలం పార్టీ ప్రెసిడెంట్ జడ్డు హరిబాబు, పెంటపాడు మండలం పార్టీ ప్రెసిడెంట్ కైగాల శ్రీను, పెంటపాడు మండలం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కట్టుబోయిన కృష్ణ ప్రసాద్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు, నియోజకవర్గ మహిళా కన్వీనర్ తాడిపత్రి రజిని, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు తెన్నేటి జగ్జీవన్, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు కొట్టు నాగేంద్ర, దర్శిపర్రు సొసైటీ చైర్మన్ గుండుమోగుల సాంబయ్య, పెంటపాడు ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, ఇంకా పలువురు గ్రామ సర్పంచులు, సొసైటీలు చైర్మన్లు, ఎంపీటీసీలు, వార్డు ఇన్చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts