ఆలయానికి చేరుకున్న చోళుల కాలం నాటి విగ్రహాలు

నేటి శివపార్వతుల కళ్యాణంలో ప్రధాన ఆకర్షణ

ఆలయానికి చేరుకున్న చోళుల కాలం నాటి విగ్రహాలు

IMG-20241112-WA0106

నర్సీపట్నం, పెన్ పవర్ :

బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన చోళుల కాలం నాటి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలు సుదీర్ఘ విరామం తర్వాత ఆలయానికి చేరుకున్నాయి. అత్యంత పురాతనమైన ఈ పంచలోహ విగ్రహాలు 1990లో చోరీ కాబడ్డాయి. తరువాత తాళ్లరేవు ప్రాంతంలో పోలీసులు వీటిని రికవరీ చేశారు. అప్పటినుండి  ఈ విగ్రహాలు ట్రెజరీ లోనే భద్రపరుస్తూ వచ్చారు. ప్రతి ఏడాది ఆలయంలో జరిగే శివపార్వతుల కళ్యాణానికి వేరే విగ్రహాలు వాడుతూ వచ్చారు. అయితే ఈ సంవత్సరం ఏకాదశి రోజు జరగనున్న శివపార్వతుల కళ్యాణంలో ఆనాటి విగ్రహాలనే ఉంచాలని ఉత్సవ కమిటీ పట్టు పట్టింది. దీంతో దేవాదాయ శాఖ అధికారులు ట్రెజరీ లో ఉన్న ఈ పంచలోహ విగ్రహాలను గట్టి బందోబస్తు నడుమ ఆలయానికి చేర్చారు. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత పురాతన పంచలోహ విగ్రహాలు ఆలయానికి చేరుకోవడంతో, వాటిని చూసి తరించేందుకు స్థానికులు బారులు తీరారు. మంగళవారం జరగనున్న శివపార్వతుల కళ్యాణంలో ఈ పురాతన విగ్రహాలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

Tags:

About The Author

Related Posts