రహదారి భద్రత నియమాలు పాటించాలి

గంగవరం ఎస్ఐ బి వెంకటేష్

రహదారి భద్రత నియమాలు పాటించాలి

 

IMG-20250220-WA0088

గంగవరం, పెన్ పవర్, ఫిబ్రవరి 20:

వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలను పాటించాలని గంగవరం ఎస్సై బి వెంకటేష్ సూచించారు. స్థానిక వై జంక్షన్ లో రహదారి భద్రత నియమాలపై వాహనదారులకు పాదచారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించవద్దని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ద్విచక్ర వాహనాలు పై త్రిబుల్ రైడింగ్ అసలు వద్దని  చట్టరీత్య నేరమని హెచ్చరించారు అలాగే మైనర్లకు వాహనాలు డ్రైవింగ్ వద్దని నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన రికార్డులను వాహనాలతో పాటు ఉంచుకోవడంతో పాటు సక్రమంగా నిర్వహించుకోవాలన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని తద్వారా కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ చేపట్టి రికార్డులు సక్రమంగా లేని వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. గంగవరం పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Tags:

About The Author

Related Posts