వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు
గంగవరం,పెన్ పవర్, ఫిబ్రవరి 20:
చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఏజెన్సీ డి ఈ ఓ వై మల్లేశ్వరరావు ఆదేశించారు. గురువారం మండలంలోని ఓజుబంధ, జగ్గంపాలెం జీఎం పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు . ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలు డైరీలు పరిశీలించారు. అలాగే విద్యార్థుల యొక్క వర్క్ బుక్స్, తెలుగు ,ఇంగ్లీష్, లెక్కలు సబ్జెక్టులు విద్యార్థుల యొక్క అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించి, ఇంగ్లీషు, లెక్కల సామర్ధ్యాలను మెరుగుపరచాలని సూచించారు. అలాగే విద్యార్థుల కోసం సిద్ధం చేసిన మధ్యాహ్న భోజన పథకం భోజనాలను వంటకాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. ఆయన ప్రధానోపాధ్యాయులు వెంకటలక్ష్మి, అయ్యా రావు, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.