అన్నవరం కలప డిపోలో  విజిలెన్స్ తనిఖీలు

వ్యక్తిగత కక్షలతో తప్పుడు ఫిర్యాదులు మానుకోవాలన్న విజిలెన్స్ డి ఎఫ్ ఓ

అన్నవరం కలప డిపోలో  విజిలెన్స్ తనిఖీలు

IMG-20241023-WA0220

 

నర్సీపట్నం, పెన్ పవర్ :

కోటవురట్ల  మండలంలోని అన్నవరం గ్రామంలో ఉన్న శ్రీదుర్గా భవానీ సామిల్ లో విశాఖజిల్లా విజిలెన్స్ డి ఎఫ్ ఓ ధర్మారక్షిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సామిల్లులో అక్రమ కలప ఉన్నదా లేదా అని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు  క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న కలప హెచ్చు తగ్గులను పరిశీలించారు. ఈ విషయంపై విజిలెన్స్ అధికారులును వివరణ కోరగా తరచూ ఇక్కడ అక్రమ కలపతో వ్యాపారం జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేపట్టామన్నారు. ఇక్కడ నిల్వ ఉంచిన కలపకు,  రికార్డుకు ఎక్కడా వ్యత్యాసం కనిపించలేదని  తెలిపారు.  నర్సీపట్నం, చోడవరం అనకాపల్లి  ప్రాంతాల్లో సుమారు 35 సామిల్లులు  ఉన్నాయని, గుర్తుతెలియని అజ్ఞాత వ్యక్తులు రాజకీయ కక్షలతో తరచూ సామిల్లులపై ఫిర్యాదులు చేయడం సమంజసం కాదన్నారు. ఈ విధంగా అధికారుల విలువైన సమయాన్ని వృధా చేయడం వలన విధులపై దృష్టి పెట్టలేకపోతున్నామని  వాపోయారు. ముఖ్యంగా  నర్సీపట్నంలో ఉన్న పది సామిల్లులు ఉన్నాయని , వారిలో కొంతమంది వ్యాపారులు ఈ ఫిర్యాదులకు పాల్పడుతున్నారని అన్నారు. IMG-20241023-WA0203ఆయన వెంట ఫారెస్ట్ రేంజ్ అధికారి శంకరయ్య, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రసాద్, స్థానిక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అప్పారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts