విద్యుత్ చార్జీలు తగ్గించాలని నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
అమలాపురం, పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 8:
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన తెలిపిన కొండేటి చిట్టిబాబు
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పిలుపుమేరకు
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ షర్మిల రెడ్డి పిలుపు మేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు శ్రీ కొండేటి చిట్టిబాబు నాయకత్వంలో విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమం జరిగినది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రూ అప్ చార్జెస్ పేరుతో ఒకేసారి 6 వేల 72 కోట్ల రూపాయల భారాన్ని సామాన్య ప్రజలపై మోపిందని, యూనిట్ ధర 1.90 రూపాయల నుండి 2.70 రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, పేద ప్రజల తరఫున నిలబడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడటానికి ఎప్పుడూ ఉంటదని ఎన్నికలలో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీని తప్పి ప్రజలను మోసం చేసిందని ప్రభుత్వ పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని దీపావళి రోజు ఒక చేత్తో ఉచిత గ్యాస్ నిచ్చి రెండవ చేతితో విద్యుత్ ఛార్జీలు పెంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దీపావళి సంతోషం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చేసిందని వాపోయారు. ఈ కూటమి ప్రభుత్వం వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గించాలని లేనిచో గ్రామస్థాయిలో ప్రజలతో కలిసి ఉద్యమించి అసెంబ్లీ ముట్టడి చేస్తామని అన్నారు. అలాగే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్న ఉన్మాదులను ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు కొత్తూరి శ్రీనివాస్, అమలాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంటెద్దు బాబి, అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ అయితా బత్తుల సుభాషిని ,మాజీ పిసిసి అధికార ప్రతినిధి ముషిణి రామకృష్ణారావు, ఏఐసిసి మెంబర్ యార్లగడ్డ రవీంద్ర, పిసిసి డెలిగేట్ మాచవరం శివన్నారాయణ, రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కోట శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు మహబూబ్ షకిలా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మలపర్తి మోహన్రావు, నిమ్మకాయల ప్రసాద్, దేవరపల్లి రాజేంద్ర బాబు ,బి ఏ జె డబ్ల్యూ రెడ్డి బాబు, చిలకపాటి శ్రీధర్, మండల అధ్యక్షులు అప్పన శ్రీరామకృష్ణ, రాయుడు వెంకటరమణ, జోగి అర్జున్ రావు, బొంతు రాజేంద్ర బాబు, వానరాశి దొరబాబు, నిమ్మకాయల త్రిమూర్తులు, కొండేటి వెంకటేశ్వరరావు, కేముల్లేటి వెంకటేశ్వరరావు, అయితా బత్తుల కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.🙏 ఇట్లు వంటెద్దు బాబి. పట్టణ అధ్యక్షులు.