పాఠశాలల్లో ప్రైవేట్ ఈవెంట్లకు అనుమతిస్తే కఠిన చర్యలు:జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,నవంబర్14:జిల్లాలో ప్రభుత్వ నిర్వహణలో గల పాఠశాలల ప్రాంగణంలో రాజకీయ,మతపరమైన, వివాహాలు,ఇతర ప్రవేట్ ఈవెంట్లకు అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కొంతమంది ఆర్.జె.డి.ఎస్.ఈ లు,డిఈఓలు మరియు హెడ్ మాస్టర్లు అటువంటి కార్యకలాపాలకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారని కలెక్టర్ వివరించారు.వారి నిర్ణయం ప్రకారము పాఠశాల సమయానికి ముందు మరియు తరువాత లేదా పాఠశాల సమయంలో ప్రభుత్వ మేనేజ్‌మెంట్ పాఠశాలల ఆవరణలో రాజకీయ, మత, వివాహ సంబంధిత మరియు ప్రైవేట్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని జిల్లా విద్యాశాఖ అధికారులు, గిరిజన సంక్షేమ అధికారులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించడం జరిగిందని, సూచనలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ హెచ్చరించారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.