సాగు,తాగు నీరుకు తీగలేరు తోనే పరిష్కారం
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి బాబు
పుల్లలచెరువు పెన్ పవర్ నవంబర్ 10:పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు సాధన కొరకు భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం ఆదివారం మండలంలోని కాలువ పరివాహక ప్రాంత గ్రామాలైన కాశి కుంట తండా నుంచి కొమరోలు, ఎండ్రపల్లి,మల్లా పాలెం,మరియు తండాలు, రాచకొండ,వెంకరెడ్డి పల్లి, ఆర్ ఉమ్మడివరం పుల్లలచెరువు వివిధ గ్రామాలలో ప్రాజెక్టు ఆవశ్యకత గురించి రైతులతో చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు టిసి హెచ్ చెన్నయ్య మాట్లాడుతూ, వెలుగొండ ప్రాజెక్టు అంతర్గత భాగమైన 5 బ్లాక్ కాలును ఎర్రగొండపాలెం మండలం లోని వీరయ్యపాలెం వరకు కాలువ పూర్తి అయినదని పుల్లలచెరువు చిన్న కండ్లేరు చెరువు వరకు చేయవలసిన ఆగిపోయినవని గత ప్రభుత్వంలో కాలువ సర్వే చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు,అనంతరం ప్రభుత్వం టీ5 గురించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు,సర్వే నివేదిక ప్రకారం సుమారు 80 కోట్లు అవుతాయని నివేదిక పంపారు. ఈ ప్రాజెక్టు కాలువ పూర్తి అయితే దాదాపు 11,500 ఎకరాలు సాగులోకి వస్తుందని త్రాగు నీరు కూడా 50 వేల నుండి 60 వేల జనాభాకు తాగునీరు అందుబాటులోకి వస్తుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే ఈ కాలువ పనులు కోసం రాబోవు బడ్జెట్ సమావేశంలో నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలని సిపిఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ సిపిఐ సహాయ కార్యదర్శి గురునాథం మాట్లాడుతూ,గతంలో కూడా సాగర్ ప్రాజెక్టు జలాలు పుల్లలచెరువు మండలానికి దాపులో ఉన్నప్పటికీ కూడా నోచుకోలేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు టీవీ5 కాలువ పోరాటం ద్వారా సాధించుకునే పరిస్థితి నెలకొన్నదినే అన్నారు.వర్షాభావం మీద ఆధారపడి పంటలు పండించుకునే పరిస్థితి ఉన్నదని భూగర్భ జలవాలు పడిపోవటం వల్ల బోర్ల మీద ఆధారపడి పంటలు పండించుకునే పరిస్థితి నేటికి జరుగుతుందన్నారు.వేసవిలో మంచినీరు కూడా దొరకక నేటికీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి , మంచినీటి కోసం ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చు పెడుతుంది, అదేవిధంగా ప్రభుత్వం మంచినీటి దాహార్తి తీర్చేందుకు, ముటుకులల్లో సమ్మర్ స్టోరేజ్ కి కోట్లు రూపాయలు ఖర్చు పెట్టిందని నేటికీ కూడా సమ్మర్ స్టోరేజ్ ద్వారా 44 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించే దానిలో విఫలమైందని,పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తీగలేరు కాలువ పనులు చేపట్టినట్లయితే మండలం కరువు కాటకాల నుండి పూర్తిగా విముక్తి చెందుతుందన్నారు.యర్రగొండపాలెం నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు బాణాల రామయ్య మాట్లాడుతూ, రైతుల నష్ట బారిన పడకుండా రైతులను ఆదుకోవాలని ప్రతి రైతు కు 20 వేలరూపాయలు పెట్టుబడిసాయం అందిఇవ్వాలని. రాష్ట్ర ప్రభుత్వం పంటలభీమా సొమ్ము ప్రభుత్వం మే ఆడుకోవాలని కోరారు,రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి ప్రాజెక్టు పరిధిలో పునరావస గ్రామాల సమస్యలు పరిష్కరించాలని కోరారు.