వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :దామనాపల్లి సర్పంచ్ కుందేరి రామకృష్ణ
గూడెం కొత్తవీధి,పెన్ పవర్ జూలై 20: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నాలుగు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడెం కొత్తవీధి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దామనపల్లి సర్పంచ్ కుందేరి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని కావున వాగులు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.వరద ఉధృతి ఎక్కువగా ఉంటే దయచేసి కాలువలు దాటడానికి ప్రయత్నం చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు.అలాగే మట్టి ఇళ్లు,రేకుల ఇల్లులలో గోడలు వర్షానికి తడిసి కూలే ప్రమాదం అధికంగా ఉందని కావున జాగ్రత్తగా ఉండాలని అన్నారు.తడిసిన విద్యుత్తు స్తంభాలను ముట్టుకోవద్దని తడి వలన విద్యుత్ స్తంభాలలో కరెంటు సప్లై అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.వరి నారుమళ్లు వర్షానికి నీట మునిగాయని అధికారులు నష్టపరిహారం అందించేందుకు కృషి చేయాలని కోరారు.అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన కోరారు.అలాగే పశువుల కాపు కొరకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.వర్షాకాలం కాబట్టి దూర ప్రాంతాలకు నడిచి వెళ్ళవద్దు అని అన్నారు. వేడి చేసి చల్లార్చిన నీటినే త్రాగాలని సూచించారు.అనారోగ్య సమస్యల సంభవిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.