పరిశ్రమల పార్కులు ఏర్పాటుకు ప్రణాళికలు:జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మార్చి 29:అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు అవసరమైన కార్యచరణ,ప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేసారు. వచ్చే నెల 10 వ తేదీలోగా ప్రణాళికలు సమర్పించాలని చెప్పారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయం నుండి ఐటిడి ఏ పి.ఓలు, పరిశ్రమల శాఖ, ఎపి ఐఐసి, వ్యవసాయం, ఉద్యాసపస, ట్రాన్స్కో, విద్యాశాఖ అధికారులతో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ పార్కులు ఏర్పాటుకు జిల్లాలో 50 నుండి 100 ఎకరాల భూములను గుర్తించాలని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల పార్కు ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. అరకు వ్యాలీ, చింతపల్లి మండలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.

దానికి అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయానుబంధ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లాలో పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేయడానికి సమగ్రమైన అధ్యయనం చేయాలని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వ్యసాయానుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఐటిడిఏ ల పరిధిలో పరిశ్రమలు ఏర్పాటు పై పర్కుషాపు నిర్వహించాలని పేర్కొన్నారు. పాడేరు మండలంలో భూమిని గుర్తించాలని సబ్ కలెక్టర్ కు సూచించారు. రెండు ఎకరాల భూమిని గుర్తించాలని సబ్ కలెక్టర్ కు సూచించారు.

చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పితే గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని చెప్పారు. కాఫీ, ఉద్యాన పన, సేంద్రీయ వ్యసాయ పరిశ్రమలు నెలకొల్పడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. చిక్మగుళూరు, బెంగుళూరు ప్రాంతాలలో పర్యటించి పరిశ్రమల పార్కులను సందర్శించాలని అన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చేపట్టిన భూముల గుర్తింపుపై సమీక్షించారు. ఒక లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని ఆ దిశగా చర్యలు చేపట్టాలని కాఫీ అధికారులను ఆదేశించారు. ఏడాదికి 30 వేల ఎకరాల చొప్పున విస్తరించడానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మైనింగ్ కార్యక్రమాలపై సమీక్షించాలన్నారు.ఎంఎస్ఎంఈ సర్వే వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.జూన్ లోపల పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పారు.ఈ సమావేశంలో రంపచోడవరం ఐటిడి ఏ పి. ఓ కె. సింహచలం,పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ , రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, జిల్లా పరిశ్రమల అధికారి రవిశింకర్, ఎపి ఐ ఐసి జోనల్ మేనేజర్ ఎ. సింహచలం, జిల్లా ఆగ్రో ట్రేడ్ మార్కెటింగ్ అధికారి పి. ఆర్. రాకేష్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.సంద్, ఎపి ఇపిడిసి ఎల్ ఎస్. ఇIMG-20250329-WA1214 . జి. ఎస్.ప్రసాద్, జిల్లా ఉద్యాన వన అధికారి ఎ.రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.