టొంగికోట పాఠశాల భవనం పై కూలిన భారీ వృక్షం - పాఠశాల భవనం నేలమట్టం.  

IMG-20240716-WA0873 👉సెలవు రోజు కావడంతో పాఠశాలలో విద్యార్థులు లేకపోవడం వల్ల తప్పిన పెను ప్రమాదం. 

👉హుటా హూట్టిన సంఘటన స్థలంలో చేరుకున్న విద్యాశాఖ సిబ్బంది సిఆర్ పి అనిల్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయుడు రామకృష్ణ. 

👉నూతన పాఠశాల భవనం ఏర్పాటు చేయాలి -పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మర్రి రాజు.

ముంచంగిపుట్టు, పెన్ పవర్, జూలై 16.

పాఠశాల భవనం పై భారి వృక్షం కూలడంతో పాఠశాల భవనం ఒక భాగం నేలమట్టమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండలం, వనభసింగి పంచాయితి, టొంగికోట మండల ప్రాథమిక పాఠశాల భవనం పై భారీ వృక్షం కూలడంతో భవనం నేలమట్టం అయ్యాయి. మంగళవారం సెలవు రోజు కావడంతో పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుడు పాఠశాలలో లేకపోవడంవల్ల పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చెట్టు మొదలు తడిచి ఉండడం, చిన్నపాటి గాలికి పాఠశాల భవనం పై భారీ వృక్షం కూలడంతో భవనం పూర్తిగా ధ్వంసమయ్యాయని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మర్రి రాజు, గ్రామస్తులు దేసీది తిరుపతి, హరికృష్ణ, గణపతి తెలిపారు. పాఠశాల నిర్వహించిన రోజుల్లో ఇలా జరిగి ఉంటే మా పిల్లల పరిస్థితి ఏమై ఉండేదో అని, సెలవు రోజు ఇలా కావడం వల్ల అందరు ఊపిరి పీల్చుకున్నామని పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాల భవనం పై చెట్టు పడిన విషయం తెలియగానే హుటాహుటిన మండల విద్యాశాఖ సిబ్బంది సిఆర్పి అనిల్, పాఠశాల ఉపాధ్యాయుడు సీసా రామకృష్ణ టొంగికోట పాఠశాలకు చేరుకుని జరిగిన ఘటనని పరిశీలించారు. తదనంతరం వారు మాట్లాడుతూ ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టి తీసుకెళ్తామని తెలిపారు. జరిగిన ఘటనను అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే నూతన పాఠశాల భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 ముంచంగిపుట్టు  పెన్ పవర్ విలేకరి: కిముడు రాంబాబు  

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.