కమ్మరి తోట అంగన్వాడి కేంద్రం కోడిగుడ్లు ఆక్రమణ తరలింపు పై విచారణ
👉అక్రమ తరలింపు పై విచారణ కమిటీ ఏర్పాటు
👉ఎంపీడీవో, సిడిపిఓ ఆధ్వర్యంలో కమిటీ
👉నెలసరి సరుకులు సక్రమంగా పంపిణీ చేయలేదని ఆరోపణలు.
👉 ఐసిడిఎస్ సిడిపిఓ ఏ.లక్ష్మీదేవి
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూలై 17: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దారకొండ పంచాయితీ కమ్మరి తోటలో అంగన్వాడీ కేంద్రం నుండి మంగళవారం సాయంత్రం దారకొండ గ్రామంలో వ్యాపారవేతకు అంగన్వాడి కోడిగుడ్లు అమ్మటానికి ఆక్రమంగా తరలిస్తున్నప్పుడు కమ్మరి తోట గ్రామస్తులు అంగన్వాడీ కార్యకర్త, ఆమె భర్తను పట్టుకోవడం జరిగింది. ఆ సమయంలో వీడియో తీసి వివిధ మాధ్యమాల్లో పెట్టటంతో విషయం జిల్లా కలెక్టర్ వరకు వెళ్ళింది. జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ అధికారులకు సూచించడంతో జీకే వీధి సిడిపిఓ ఏ లక్ష్మీదేవి కమ్మరి తోట అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టారు. అంగన్వాడి కేంద్రం పరిధిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఈ అంగన్వాడీ కేంద్రం పరిధిలో గర్భవతులు బాలింతలు 17 మంది, టి హెచ్ ఆర్ పిల్లలు 39 మంది, ప్రీ స్కూల్ పిల్లలు 43 మంది ఉన్నారు. సాధుపాకలు కొత్త పాకలు గ్రామాలు కూడా ఇక్కటి అంగన్వాడీ కార్యకర్త పరిధిలోనికి వస్తాయి. అంగన్వాడి కేంద్రంలో స్టాకులు పరిశీలించగా 152 కోడిగుడ్లు తక్కువగా ఉన్నాయి అని సిడిపిఓ ఏ లక్ష్మీదేవి తెలిపారు. కేంద్రంలో బియ్యం లేకపోవడం, మిగతా సరుకులు ఇచ్చిన స్టాక్ కన్నా తక్కువగా ఉండటం గమనించారు. గర్భవతులకు బాలింతలకు గత నెల అంగన్వాడీ కార్యకర్త పాలు, గుడ్లు కొలత ప్రకారం కాకుండా లబ్ధిదారులకు తగ్గించి ఇచ్చినట్లు గ్రహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో రికార్డులను అన్ని పరిశీలించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దీనిపై విచారణ కమిటీ వేయడం జరిగిందని ఎంపీడీఓ, ఐసిడిఎస్ సిడిపిఓ లను విచారణ కమిటీగా వేశారని పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రికార్డులు పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తామని అన్నారు.లబ్ధిదారులకు పరిమాణం మేరకు స్టాక్ ఇవ్వనందుకు,లబ్ధిదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రికార్డులు సరిగ్గా అప్డేట్ చేయనందుకు అంగన్వాడీ కార్యకర్త మరియు సూపర్వైజర్ కు మెమో జారీ చేయడం జరిగిందని తెలిపారు.ఎంపీడీవో,సిడిపిఓ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి విచారణ అంగన్వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారులు,గ్రామస్తుల సమక్షంలో నిర్వహించి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని,విచారణలో అంగన్వాడీ కార్యకర్త తప్పిదం ఉన్నదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నడిగట్ల రాజు, ఎంపీటీసీ మాడి రామన్న,నాయకులు పిల్ల బుజ్జి,ఐసిడిఎస్ సూపర్వైజర్లు డి.మోహిని,డి కృష్ణకుమారి,గ్రామస్తులు,అంగన్వాడీ లబ్ధిదారులు పాల్గొన్నారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.