వర్షాకాలం అన్ని విధాల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వర రాజు
స్టాప్ రిపోర్టర్/పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జులై 20: రాష్ట్రంలో తుఫాను కారణంగా అధిక వర్షపాతం నమోదవుతున్న తరుణంలో మన గిరిజన ప్రాంతాలలో గేడ్డలు,వాగులు పొంగి ప్రవహిస్తున్నాయిని అత్యవసర పరిస్థితులలో రాకపోకలు జరిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల పాడేరు ఎమ్మెల్యే మత్స్య రస విశ్వేశ్వర రాజు ప్రజలకు పిలుపునిచ్చారు.
భారీ వర్షాల వల్ల పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినచో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ఈ విషయం పట్ల అధికారులు రైతులకు అండగా నిలబడాలని కోరారు.వర్షాకాలంలో దోమల ప్రభావం గ్రామాలలో ఎక్కువగా ఉంటుందని దోమల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.దోమ కాటు వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి పలు వ్యాధులకు చికిత్స అందించడంలో ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆశ,
కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ మండల వైద్యాధికారులు తగు సలహాలు సూచనలు ఇస్తూ తగిన మందులు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు.వర్షకాలం కారణంగా ప్రజలందరూ వేడి నీటిని మాత్రమే తాగాలని సలహా ఇచ్చారు. తడిగా ఉన్న విద్యుత్ స్తంభాలను తాకరాదని తడివలన దాంట్లో విద్యుత్ సరపర జరిగి విద్యుత్ ఘాతం ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. అత్యవసరమైతేనే తప్ప ఎవరు బయటకు వెళ్ళవద్దు అని అన్నారు. అలాగే మండల అధికారులు,సచివాలయం సిబ్బంది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. వైసిపి నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలకు వర్షం వల్ల ఏ ప్రమాదం జరిగిన సహాయం చేయటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.