దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్‌మార్క్ యాజమాన్యం దాడి

దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్‌మార్క్ యాజమాన్యం దాడి

పథకం ప్రకారమే దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్‌మార్క్ యాజమాన్యం దాడి..
నిందితులను కఠినంగా శిక్షించాలన్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య..
దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డీసీపీ, ఏసీపీ లకు ఆదేశం..
వార్తలు రాసిన విలేఖరులపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు..

దుండిగల్‌, పెన్ పవర్, నవంబర్ 22:
 
జర్నలిస్టు మద్దయ్యపై దాడిచెసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డిసిపి, ఎసిపి లను ఆదేశించారు.. ప్రభుత్వ భూ అక్రమణలపై వార్త కధనాలు రాసిన సీనియర్ జర్నలిస్టు మద్దయ్యపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. జర్నలిస్టు మద్దయ్యపై జరిగిన దాడి విషయంలో, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.23112024శంకర్,దాడికి గురైన జర్నలిస్టు మద్దయ్య,మాలమహ నాడు నేత బొట్టు నర్సింగ్ రావులు డిల్లీ పర్యటనలో వున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు పొన్‌లో వివరించారు. వెంటనే స్పందించిన చైర్మన్ బక్కి వెంకటయ్య పేట్ బషిరాబాద్ డిసిపి కోటిరెడ్డి, మేడ్చల్ ఎసిపి లకు పొన్ చెసి సంఘటనపై  ఆరా తీశారు.. నిందితులపై బిఎన్.ఎస్, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం కింద కేసు నమోదు చెసినందున విచారణను త్వరగా పూర్తి చెసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనె స్పందించిన చైర్మన్‌కు డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, జర్నలిస్టు మద్దయ్యలు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ సైబారబాద్ కమిషనరేట్ పరిధిలోని దుండిగల్ పొలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ భూములను, చెరువును అక్రమించి వెంచర్ చెస్తున్న త్రిపుర ల్యాండ్‌మార్క్ నిర్మాణ సంస్ధ అక్రమాలు భూ కబ్జాలపై వార్తలు రాసిన జర్నలిస్టు మద్దయ్యపై  పథకం ప్రకారమే దాడిచేశారని..! నింధితులు ల్యాండ్‌మార్క్ వెంచర్ నిర్వాహకుడు సుధాకర్ తదితరులను తక్షణమె అరెస్టు చేయాలన్నారు..
 
తహశీల్దార్ సమక్షంలోనే జర్నలిస్టుపై దాడి..!
 
 దుండిగల్‌ మండలం బౌరంపేటలోని డి.పోచంపల్లి సర్వే నెంబర్181, 282, 184, 187, 188, 199 లో  ఎఫ్‌టిఎల్‌ బఫర్ జోన్ భూమిని అక్రమించి వెంచర్ నిర్మాణం చెస్తున్నారని పేర్కొన్నారు.. ఈ భూ అక్రమాలపై వరుస కథనాలతో, ఉన్నతాధికారులు స్పందించి, తహశీల్దార్‌ను ఆదేశించడంతో, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి విచారణకు వెళ్ళిన సమయంలో.. వార్త సేకరణకు ఇతర జర్నలిస్టు లతో కలిసి వెళ్ళిన జర్నలిస్టు మద్దయ్యపై తహశీల్దార్ సమక్షంలోనే ఒక్కసారిగా "త్రిపుర ల్యాండ్‌మార్క్" నిర్మాణ సంస్ధ యండి సుధాకర్, పది మంది దుండగులు బాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, చిన్నారెడ్డి,వెంకట్  తదితర దుండగులను దాడికి ఉసిగొలిపి గాయపర్చారని అన్నారు.  నిందితులపై దుండిగల్ పోలీసులు బిఎన్ ఎస్,ఎస్సీ,ఎస్టీ అత్యచారాల నిరోధక చట్డం కింద కేసులు నమోదు చెసినందున  పోలీసులు విచారణను త్వరితగతిన పూర్తి చెసి నిందితులను కఠినంగా  శిక్షించాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వ భూములు చెరువులను అక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కొరడ జులిపిస్తున్న నేపధ్యంలో ప్రజా శ్రేయస్సు ప్రభుత్వ భూములను కాపాడేందుకు వార్తలు రాసిన జర్నలిస్టు మద్దయ్యకు రక్షణ కల్పించాలన్నారు..

About The Author