రేపు నాయకంపల్లిలో శివ పంచాయతన క్షేత్రం ప్రారంభం
By G ANIL KUMAR
On
గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శివ పంచాయతన క్షేత్రాన్ని రేపు(గురువారం) జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి ప్రారంభిస్తారని తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస బంగారయ్య శర్మ తెలిపారు. బుధవారం నాయకంపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్షేత్రంలో నిర్మించిన సువర్ణ భారతి గోశాల, పాకశాల, ప్రవచన మంటపములు ప్రారంభించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ అగ్నిహోత్రిని దేవాలయం నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరు కావాలని కోరారు.
Tags: