జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన జగ్గంపేట వైసీపీ నాయకులు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం ఆదేశాల మేరకు గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జగ్గంపేటలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గణేష్ రాజా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశ ప్రధమ సామాజికతత్వవేత్త , సమన్యాయ సత్య బోధకుడు అని, అంటరానితనాన్ని, కుల వ్యవస్థను నిర్మూలించడంలో, మహిళలు యొక్క అభ్యున్నతికి పాటుపడడంతో పాటుగా, విద్యారంగంలో, వితంతు మహిళల పట్ల ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రం మహాలక్ష్మి, గాది కృష్ణ, అడబాల నాగు, గిడియాల పెద్దకాపు, సాపిరెడ్డి సత్తిబాబు, పల్లపాటి రాజు, పైలా చైతన్య, పైలా నానాజీ, వడ్లపాటి జయబాబు, కాపవరపు సుబ్రహ్మణ్యం, అంబటి చిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.