పెద్ద గంగవరం గ్రామంలో పీఎం జన్ మన్ పథకం పై అవగాహన సదస్సు:సర్పంచ్ నడిగట్ల రాజు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 28:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దారకొండ పంచాయతీలో పెద్ద గంగవరం గ్రామం వద్ద స్థానిక సర్పంచ్ నడిగట్ల రాజు, ఎంపీటీసీ మాడి రామన్న ఆధ్వర్యంలో పీఎం జన్ మాన్ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పివిటిజి గిరిజన తెగల అభివృద్ధి కోసం పీఎం జన్ మాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పథకం ద్వారా పివిటిజి గిరిజనులను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.పీఎం జన్ మాన్ పథకం ద్వారా గ్రామంలో అందరికీ గృహాలు ఏర్పాటు చేయటం,డ్రైనేజీ, సిసి రోడ్లు, మంచినీటి సదుపాయం పాఠశాల విద్యుత్ ఇతర మౌలిక సదుపాయాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుందని దిన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాడి రామన్న, వార్డు సభ్యులు పాంగి పుల్లయ్య, సచివాలయం సెక్రటరీ నాయుడు,ఆరోగ్య సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.