మంత్రికి సమస్యలు వివరించిన జనసేన పార్టీ నాయకుడు గొర్లె వీర వెంకట్:తుఫాన్ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి

గూడెం కొత్త వీధి,పెన్ పవర్ సెప్టెంబర్10:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో మంగళవారం పర్యటించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి మండలంలో పలు సమస్యలను,అలాగే తుఫాన్ వల్ల ఏర్పడిన నష్టాన్ని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గొర్లె వీర వెంకట్ వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండలంలో తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించటానికి రావడంతో జనసేన పార్టీ నాయకుడు గొర్లె వీర వెంకట్ మండలంలో వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాన్ని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు.అందులో ప్రధానంగా గాలికొండ పంచాయితీ చట్రాపల్లి గ్రామం మొత్తం కొండచరియలు విరిగిపడటం వలన తీవ్రంగా నష్టపోయిందని,ప్రాణ నష్టం,ఆస్తి నష్టం సంభవించిందని,కుమారి అనే మహిళ చనిపోయిందని, అనేక పశువులు మేకలు, కోళ్లు మృతి చెందాయని, గ్రామస్తుల గృహాలు కొట్టుకుపోయాయని వివరించారు.మరణించిన మహిళల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, గృహాలు కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వాలని, పంట ఆస్తి నష్టం కోల్పోయిన ప్రజలకు నష్టపరిహారం అందించాలని వినతి పత్రంలో కోరారు.అలాగే మండలంలో భారీ వర్షాలు కారణంగా జనజీవనం స్తంభించిపోయిందని, రోడ్లు బ్రిడ్జిలు, ధ్వంసం అయ్యాయని త్వరతగతిన పనులు ప్రారంభించి జనజీవనం పునరుద్ధరించేలా రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని వినతి పత్రంలో కోరారు. రైతుల యొక్క పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా అధికారుల చేత సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే తుఫాన్ కారణంగా గిరిజన ప్రాంతంలో అంటు రోగాలు ప్రబలుతున్నాయని వ్యాధుల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. రవాణా వ్యవస్థను వేగవంతంగా పునరుద్ధరించాలని కోరారు. అలాగే గిరిజన ప్రాంతంలో వర్షాల కారణంగా ఏర్పడిన తీవ్ర నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రికి వివరించారు.

IMG-20240910-WA1493
మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతి పత్రం సమర్పించిన గొర్లె వీర వెంకట్

మంత్రి సమస్యలను చక్కగా విన్నారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని వీర వెంకట్ మీడియాకు తెలిపారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.