రేపటి నుండి పల్లె పండుగ:జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్
స్టాప్ రిపోర్టర్( మాదిరి చంటిబాబు)పాడేరు,పెన్ పవర్,అక్టోబర్ 13: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అక్టోబర్ 14 సోమవారం నుంచి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఆగస్ట్ 23వ తేదీ ఒకేరోజు జిల్లాలోని 430 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి గ్రామసభల్లో తీర్మానం చేసిన పనులను ప్రారంభించేందుకు, పల్లె పండుగ పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభ౦ కానుందని చెప్పారు.ఈ సందర్భంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా చేపడతామని కలెక్టర్ తెలిపారు.సుమారు 413 కోట్ల రూపాయలతో 900 పైగా వివిధ రకాల పనులను ప్రతిపాదించడం జరిగిందన్నారు.సోమవారం నుంచి ఆగస్ట్ 23వ తేదీన పంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆమోదించిన పనులు ప్రారంభించాలని సూచించారు.వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామసభల్లో తీసుకున్న అర్జీలు పరిష్కారం, తీర్మానాల అమలు చేయాలన్నారు.పల్లె పండుగలో భాగంగా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు చేయాలని సూచించారు.పల్లె పండుగలో సీసీ రోడ్లు, తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా సిటిజన్ నాలెడ్జ్ బోర్డులు అందరికీ తెలిసేవిధంగా ఏర్పాటు చేయాలన్నారు.సోమవారం 138 గ్రామపంచాయతీలలో రూ. 12.4 కోట్లతో చేపట్టనున్న 211 పనులకు శంకుస్థాపన జరుగుతుందన్నారు.ఈ 211 పనులలో 28 సీసీ రోడ్లకు 3.98 కోట్లు,మూడు బీటీ రోడ్లకు 1.63 కోట్లు, నాలుగు wbm రోడ్డులకు 5.05 కోట్లు, 4 సీసీ డ్రైన్లకు 0.17 కోట్లు, 66 పెరక్యలేషన్ ట్యాంకులకు రూ. 5.51 కోట్లు, ఏడు ఫిష్ పాండ్లకు 3.50 కోట్లు, 35 కమ్యూనిటీ సోక్ ఫిట్స్ కు 13 లక్షలు, 64 రూప్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పథకాలకు 47 లక్షలు తో పనులు ప్రారంభం కానున్నాయని కలెక్టర్ వివరించారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.