ధైర్యంగా ఉండండి - అండగా ఉంటాం:రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి
స్టాప్ రిపోర్టర్,పాడేరు/కూనవరం,గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూలై 30:వరద ముంపు బాధితులు అందరూ ధైర్యంగా ఉండాలని వారందరికీ అండగా ఉంటామని రంపచోడవరం శాసనసభ్యులు మిరియాల శిరీష దేవి బాధితులకు ధైర్యాన్ని అందించారు.నగదు బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యురాలు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల కొంత సమస్య ఉన్నప్పటికీ,వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగమంతా ఇక్కడే ఉండి సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాల సిద్ధంగా ఉందని, అర్హత గల వారందరినీ గుర్తించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు పూర్తి చేసి వారిని వీలైనంత త్వరగా పంపించే ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ప్రస్తుత కలెక్టర్ దినేష్ కుమార్ ఇదివరకు ఏ కలెక్టర్ చేయని విధంగా గత పది రోజులుగా చింతూరు లోనే మకాం వేసి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ముంపు సమయంలో బాధితులు ధైర్యంగా, సహనంగా ఉండాలని సూచించారు.జిల్లాస్థాయి అధికారులు అందరూ ఇక్కడే ఉండి బాధితులకు అవగాహన కల్పిస్తూ, ధైర్యాన్ని నూరి పోస్తున్నారని బాధితులకు అండగా ఉంటున్నారని వారి సేవలను సద్వినియోగపరచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులు మెరుగైన సేవలు అందిస్తున్నారని కలెక్టర్ ను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ముంపు మండలాల నోడల్ అధికారులు సూరజ్ గనోరే, కావూరి చైతన్య, చింతూరు ఏ ఎస్ పి రాహుల్ మీనా, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం,పలువురు జిల్లా అధికారులు,డివిజనల్ అధికారులు,మండల తహసీల్దార్,ఎంపిడిఓ, తదితరులు పాల్గొన్నారు
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.