ఘనంగా మొల్ల జయంతి వేడుకలు
స్టాఫ్ రిపోర్టర్ పెన్ పవర్,
శ్రీకాకుళం, మార్చి 13 :తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనురాధ, డీఎస్ఓ, సంఘ నాయకులు, పెద్దలు ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విలువలతో కూడిన కవిత్వాన్ని సమాజానికి అందించడంలో కవయిత్రి మొల్ల ప్రత్యేకతని కొనియాడారు. రామాయణాన్ని వివిధ భాషల్లో ఎందరో రచించారని, వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని మొల్లమాంబ తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగుభాషలో రచించడం గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వీర స్వామి, ఎర్రన్న, స్వామి, మల్లేసు, సూర్యనారాయణ, గణపతి, సత్యం తదితరులు పాల్గొన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.