శిధిల వ్యవస్థకు చేరుకున్న చామగడ్డ బ్రిడ్జి 

బిక్కుబిక్కుమంటూ వంతెన పై రాకపోకలు 

వంతెన కూలితే 30 గ్రామాలకు  రాకపోకలకు బంద్ 

గూడెం కొత్తవీధి,పెన్ పవర్ జులై 20: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం వంచుల పంచాయతీలోని చామగడ్డ గ్రామంలో పురాతన వంతెన గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాదకరంగా మారింది.ఈ వంతెన కూలడానికి సిద్ధంగా ఉంది.ఈ వంతెన గుండ  నిత్యం అనేక వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి.రోడ్డుకు కంకర వేసి వదిలేసినప్పటికీ వర్షానికి అది కూడా చిద్రమైంది.ఈ బ్రిడ్జి ఎప్పుడు కూల్తుందోనని  భయపడుతూనే వంతెనగుండ బిక్కుబిక్కుమని రాకపోకలు సాగిస్తున్నారు.ఈ వంతెన కూలితే అమ్మవారి దారకొండ పంచాయతీలో గల గొల్లపల్లి, తడకపల్లి,పెబ్బంపల్లి,జాజు పాకలు,రైలు గడ్డ,చిలకల వీధి, దుర్గం గ్రామాలతోపాటు వంచుల పంచాయతీలోని చామగడ్డ,నడుం వీధి,వజ్ర గొంది గ్రామాలకు వాహనాల ద్వారా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి.గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించటానికి,అనారోగ్య సమస్యలు సంభవిస్తే కనీసం 108 అంబులెన్స్ కూడా  రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అప్పటి ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి స్వయంగా ఈ వంతెనను పరిశీలించినప్పటికీ పనులైతే ప్రారంభించలేదు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు  వంతెన మరియు రోడ్డు సమస్య నెరవేరుతుందని స్థానిక గ్రామస్తులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. వారి ఆశలు అడియాసలైయ్యాయి.ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలోనైనా చామగడ్డ రోడ్డు వంతెన  నిర్మించాలని,వంతెన కూలితే సుమారు 30 గ్రామల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వంతెన నిర్మాణానికి  అధికారులు ప్రజాప్రతినిధులు  కృషి చేయాలని  స్థానిక చామగడ్డ గ్రామస్తులు,

IMG-20240720-WA0006
శిధిల వ్యవస్థకు చేరుకున్న చామగడ్డ వంతెన

తెలుగుదేశం పార్టీ మండల తెలుగు యువత అధ్యక్షుడు ముర్ల కోటేశ్వరరావు కోరుతున్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.