అల్లూరి జిల్లా జెసిగా పదవీ భాద్యతలు స్వీకరి౦చిన డా. అభిషేక్
స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జూలై 22: అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన సంయుక్త కలెక్టర్ గా కర్నాటక రాష్ట్రానికి చెందిన ఎంబిబిఎస్ గ్రాడ్యుయేట్ డా.ఎం.జే.అభిషేక్ గౌడ్ సోమవారం పదవీ భాద్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

ఇదివరకు గ్రామ,వార్డు సచివలయాల శాఖలో అదనపు సంచాలకులుగా పని చేసానని,ఇటీవల బదిలీలలో భాగంగా అల్లూరి జిల్లాకు జెసి గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.గతంలో అస్సాంలో కొంత కాలం గిరిజన ప్రాంతంలో పని చేసిన అనుభవం ఉన్నందున గిరిజన ప్రాంతానికి బదిలీపై రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గిరిజనులకు ఎంత చేయగలనో అంతా చేస్తానని,గిరిజనుల అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని వెల్లడించారు.ప్రస్తుతం జిల్లాలో గల చింతూరు డివిజన్ లో వరద ప్రభావం ఉన్నందున అక్కడికి వెళ్లి వరద భాధితులకు ఎటువంటి సమస్యలు లేకుండా విమర్శలకు తావు లేకుండా నిత్యావసర,అడ్వాన్స్డ్ రేషన్, మొదలగు సరుకులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంపిణీలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.అదేవిధంగా రేషన్ కార్డుల జారీలో సమస్యలు అధిగమించి అర్హులైన వారికి కార్డుల జారీకి కృషి చేస్తానని పేర్కొన్నారు.వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత జిల్లా కలెక్టర్ సూచనాదేశాల మేరకు జిల్లా అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని వివరించారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.