భారీ వర్షానికి కొత్తపాలెంలో ఇల్లు గోడ ధ్వంసం: అధికారులు సహాయం చేయాలని వేడుకోలు
On
గూడెం

కొత్తవీధి,పెన్ పవర్, జూలై 20:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం వంచుల పంచాయితీ కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరడ తెల్లన్న దొర, అరడ రాములమ్మ దంపతుల రేకుల ఇల్లు గోడ ధ్వంసమైంది. వర్షానికి ఇటుకలు తడిసి గోడ శిథిల మైనట్లు తెలిపారు.గోడ ధ్వంసమయ్యే సమయంలో ఆ గదిలో ఎవరు నిద్రించకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు సహాయం చేయాలని అరడా తెల్లన్నదొర,రాములమ్మ దంపతులు కోరుతున్నారు.
Tags:
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.