మోదకొండమ్మ ఆలయ కమిటీ పై మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రాజకీయాలు చేయటం తగదు :పాడేరు ఎమ్మెల్యే ఎం. విశ్వేశ్వర రాజు 

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జులై 21: గిరిజనుల ఇలవేల్పు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ తల్లి ఆలయం విషయంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రాద్ధాంతం చేయటం సరైన పద్ధతి కాదని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వర రాజు అన్నారు.ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల తరబడి వస్తున్న ఆనవాయితీనే తాను ఎమ్మెల్యే అయినా తర్వాత ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తీరుకోలేక ఏవేవో ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు.గతానికి భిన్నంగా అమ్మవారి ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా తాము కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు స్పష్టం చేశారు.గతంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ఆలయ చైర్మన్ గా పని చేశారని ఆ మాత్రం నిబంధనలు ఆమెకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.మతిభ్రమించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మోదకొండమ్మ అమ్మవారిని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటి బాబు నాయుడు, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూడా సురేష్ కుమార్,

IMG-20240721-WA1105
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు

నాయకులు బోనంగి రమణ, తమర్బ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.