వికలాంగుల ఉచిత ఉపకరణ నిర్ధారణ శిబిరం

వికలాంగుల ఉచిత ఉపకరణ నిర్ధారణ శిబిరం

కూనవరం

నాలుగు మండలాల నుండి హాజరైన వికలాంగులు

కూనవరం,పెన్ పవర్,ఏప్రిల్ 12. సమగ్ర శిక్ష అల్లూరి సీతారామరాజు జిల్లా వారు 18 సంవత్సరాల లోపు బాల, బాలికల వికలాంగులకు కావలసిన ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని మండల కేంద్రంలోని  జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు  జిల్లా సాహిత విద్యా సమన్వయ కర్త కొమ్మ భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష పాడేరు వారు అందించే ఉచిత ఉపకారణాల శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, వికలాంగులందరూ తప్పనిసరిగా సదరం సర్టిఫికెట్ తీసుకొని ఉండాలని అన్నారు. అనంతరం సీనియర్ ఐ ఈ రిసోర్స్ టీచర్ ఆర్ శ్యాం బాబు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కూడా సాధారణ పిల్లలు మాదిరిగానే విద్యను అభ్యసించాలని దీనిలో కలిగే ఆటంకాలు అన్నిటిని సమగ్ర శిక్ష ప్రత్యేకంగా నిర్మూలించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. సాహితీ విద్యకు సంబంధించిన సహాయ ఉపకారణాల పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. శిబిరానికి హాజరైన వికలాంగులకు అవసరమైన ఉపకరణాలను నమోదు చేసుకొని నాలుగు మండలాల లోని సమగ్ర శిక్ష వారికి అందిస్తామని అన్నారు. కూనవరం,విఆర్ పురం,చింతూరు,ఎటపాక నుండి హాజరైన తల్లిదండ్రులకు రానుపోను రవాణా చార్జీలు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అసెస్మెంట్ టెక్నీషియన్ టి కోటేశ్వరరావు, ఎంఈఓ 2 టి లక్ష్మయ్య, ఐ ఈ రిసోర్స్ టీచర్స్ కూనవరం కే కావ్య, బి వెంకన్న బాబు, వి ఆర్ పురం ఎం జ్యోతి, పి సాయి చందన, ఎటపాక ఎస్ విజయ, చింతూరు కే జయలక్ష్మి, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ జడ్పీహెచ్ఎస్ సీతాపురం ఎస్. శాంతకుమారి పాల్గొన్నారు.

Tags:

About The Author