సకాలంలో భాధితులకు సహాయం అందించండి:జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్  

స్టాప్ రిపోర్టర్,చింతూరు,పాడేరు,పెన్ పవర్,జులై 22,:వరద సహాయ సహకారాలు వరద బాధితులకు సకాలంలో అందించే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎయస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.సోమవారం చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమును కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. 

ఆర్డబ్ల్యుయస్ ద్వారా వాటర్ ప్యాకెట్లు సరఫరాతో పాటు పాడైన బోర్లు రిపేర్లకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా రోడ్లు కట్ వివరాలు తయారు చేసే సమర్పించాలని ఆదేశించారు.వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ముంపు మండలాల్లోని గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. సుమారు 226 మందిని గర్భిణీ స్త్రీలను దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగిందని,ప్రతి మండలంలో మొబైల్ మెడికల్ క్యాంపులు,పునరావాస కేంద్రాలలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.ఏపీ ఈపీడీసీఎల్ విధ్యుత్ సరఫరా,తొలగింపు వివరాలు ముందుగానే వరద బాధితులను తెలియజేయాలని ఆదేశించారు.పంచాయతీరాజ్ శాఖ ద్వారా అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కొండలరావును ఆదేశించారు. మత్స్యశాఖ ద్వారా ముంపునకు గురయ్యే చేపల చెరువులు గూర్చి ఆరా తీశారు.

ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన 1132 మెట్రిక్ టన్నుల బియ్యం ముందుగా ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటివరకు 554 మెట్రిక్ టన్నుల బియ్యం వరద బాధితులకు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. బంగాళదుంపలు, కూరగాయలు,వంటనూనె వరద బాధితుల కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వరద సహాయక చర్యలు గూర్చి ప్రజలను అప్రమత్తం చేయాలని,అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వివిధ రకాలైన సమాచారం అందుబాటులో ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే,రంపచోడవరం సబ్ కలెక్టర్ యస్.ప్రశాంత్ కుమార్,చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కావూరి చైతన్య,పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సరళ వందనం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్,డిఎంహెచ్ ఓ జమల్ భాష,డిపిఓ కొండలరావు.డిఎల్ పి ఓ రఘునందన్,ఏపీ ఈపీడీసీఎల్ ఇంజనీర్ ఎండి యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

 

(స్టాప్ రిపోర్టర్ మాదిరి చంటిబాబు  పాడేరు/ గూడెం కొత్త వీధి )

IMG-20240722-WA0624
అధికారులకు సూచనలు ఇస్తున్న జిల్లా కలెక్టర్

 

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.