ఎన్నికల వాగ్ధానాల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వాం నెరవేర్చి తీరాలి
👉1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
👉జీవో నెంబర్ 3 ని పునరుద్ధరించాలి
👉గిరిజన సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాను
👉ఎంఎల్ఏ ఎం. విశ్వేశ్వర రాజు
స్టాఫ్ రిపోర్టర్/పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జులై 21: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల వాగ్దానాల్లో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వర రాజు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆదివారం పాడేరులో తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి 22వ తేదీ నుండి అసెంబ్లీలో తాను ప్రస్తావించబోయే విషయాలను గురించి మీడియాకు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని నియోజకవర్గంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆయన పేర్కొన్నారు.ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అరుకు బహిరంగ సభకు హాజరైన చంద్రబాబు నాయుడు వేలాదిమంది గిరిజనుల సాక్షిగా జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తామని,గిరిజన నిరుద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, కానీ నేడు ఆ హామీని విస్మరించారన్నారు.ఈ విషయాలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు.అలాగే గిరిజన ప్రాంతంలో 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ యదేచ్చగా గిరిజనేతరుల భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని,గిరిజనులు ఇలా నిర్మించుకుంటే కూల్చి వేస్తున్న అధికారులు గిరిజనేతరులు ఇల్లు నిర్మించుకుంటే మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నరన్నారు. దీంతో యదేచ్చగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు.గిరిజనేతరులు నిర్మించుకున్న ఇళ్లలో స్థానిక గిరిజనులు అద్దెకు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు.ఈ విషయాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు.ప్రస్తుతం అపిడమిక్ సీజన్ కావటంతో మలేరియా డెంగ్యూ విష జ్వరాలు వంటి రోగాలు ప్రబలుతున్నాయన్నారు.ప్రభుత్వం నిర్మూలన చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టటం లేదన్నారు.ఫలితంగా రోగాల తీవ్రత అధికమవుతుందన్నారు.సామాజిక,ఏరియా,జిల్లా ఆసుపత్రులలో మలేరియా డెంగ్యూ డయోరియా బాధితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాల్లో ఎపిడమిక్ సీజన్ పూర్తయ్యేంతవరకు విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఇవే కాకుండా స్థానికంగా ఉన్న సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతానన్నారు.ఈ మీడియా సమావేశంలో వైయస్సార్సీపి ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి కూడా సురేష్ కుమార్,శ్రీ మోదకొండమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటి బాబు నాయుడు,

నాయకులు బోనంగి రమణ, తమర్బా ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.