అభిజిత్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గని శెట్టి డిమాండ్
పరవాడ, పెన్ పవర్ అక్టోబర్ 22:. మండల కేంద్రమైన సినిమా హాల్ జంక్షన్ వద్ద మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో అభిజిత్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అక్రమ లే అప్ ఎత్తివేయాలని కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పరవాడ ఎలమంచిలి మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ అభిజిత్ యాజమాన్యం అక్రమ లే అప్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు అమలు చేయాలని వెయ్యి మంది కార్మికులను రోడ్డు పాలు చేయడం దుర్మార్గం అన్నారు. 1926 ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారంగా వెంటనే యూనియన్ రిజిస్ట్రేషన్ చేయాలని ఎస్సీ జెడ్ డెవలప్మెంట్ కమిషనర్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అభిజిత్ యాజమాన్యంవిధించిన అక్రమ లే ఆఫ్ పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారంగా చెల్లదన్నారు. వెంటనే కార్మికులందరినీ యధావిధిగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ లే అప్ ప్రకటించి కార్మికులకి అభద్రత భావం కలిగించిన యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని గని శెట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గేదెల అప్పారావు, కన్నూరు నాయుడు, జి. శ్రీను, ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు