శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఉగాది ఉత్సవాలుy

జంగారెడ్డిగూడెం. పెన్ పవర్. ఏప్రిల్ 9 :

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో   ఉగాది ఉత్సవాలుy

WhatsApp Image 2024-04-09 at 2.25.42 PM

 జంగారెడ్డిగూడెం మండలం  గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము ఉగాది మరియు మంగళవారం సందర్భముగా వేలాది మంది భక్తులు   బారులుతీరి దర్శించుకున్నారు. తెల్లవారుఝామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు.  అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.  శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఉత్సవములు సందర్భముగా ఆలయమును ప్రత్యేక పూలతో అలంకరించారు. ఉదయం గం.9.00 లకు  పంచాంగ శ్రవణం కార్యక్రమమును ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ప్రారంభించారు. ప్రత్యేక పూలతో అలంకరించిన  మండపం పై స్వామివారిని ఆసీనులను చేసి, అర్చక స్వాములు పంచాంగ శ్రవణం నిర్వహించారు.  ఈకార్యక్రమములో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుండి ఆలయము వద్ద  భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు  శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు  చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. ఈరోజు భక్తుల సౌకర్యార్ధం  ఆలయమువద్ద ప్రారంభించిన  మజ్జిగ చలివేంద్రంవద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకొన్నారు. మద్యాహ్నం వరకు  దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.2,25,302/- లు  సమకూరింది అని  ఆలయ నిర్వాహకులు  తెలిపారు   సుమారు 2000 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు.  శ్రీస్వామివారి దర్శనముకు  వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా పర్యవేక్షించడం జరిగిందని ఆలయ కార్య నిర్వహణ 

Tags:

About The Author