నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

బాపట్ల

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  జన్మదిన వేడుకలు బాపట్ల నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో ఘణంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీడీపి,బీజేపీ, జనసేన నాయకులు, అభిమానులు, కార్య కర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ టీడీపి, బీజేపీ,జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ  మాట్లాడుతూ విద్యార్థి దశనుంచే నారా చంద్రబాబు నాయుడు  రాజకీయాల్లో చురుకుగా ఉండే వారని, గొప్ప విజనరీ నాయకుడుని మరో సారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చెయ్యాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన అభిమానులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం కేక్ కట్ చేసి నారా చంద్రబాబు నాయుడుకి మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం, పిట్టలవాని పాలెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు  జన్మదినము సందర్బంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు..

Tags:

About The Author