బ్యాంకుల వద్ద పెన్షన్ కోసం వృద్దుల ఇక్కట్లు
By Admin
On
బాపట్ల,
వృద్ధాప్య పింఛన్ కోసం బ్యాంకుల వద్ద వృద్దులు నా తిప్పలు పడుతున్నారు.కొంతమందికి జమైన నగదు ఇంకొంత మందికి నగదు జమైన బ్యాంక్ అకౌంట్ హోల్డ్ లో ఉండటం వలన,లేదా మినిమం బ్యాలెన్స్ లేదు, అకౌంట్ మైనస్ లో ఉంది రేపు రండని చెప్తున్న బ్యాంక్ సిబ్బంది. గత నెలలో ఇంటి కి వచ్చి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు ను రానివ్వకుండా కోర్టు లో కేసు లు వేసి మమ్మలిని ఇబ్బంది పెట్టారు ఈ నెల లో అకౌంట్ లో వేసి ఇలా ఇబ్బంది పెడుతున్నారు బ్యాంకు లో జమ చేసి గంటలు గంటలు బ్యాంకులో నిరీక్షణ చేయాలి అని పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అవేదన చెందుతున్నారు. ఎప్పటి లాగా ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వచ్చుగా అని వృద్ధుల ఆగ్రహం వ్యక్తo చేస్తున్నారు. ఏమి చేయాలో తెలియక ఎండల తీవ్రత అధికంగా ఉండటం తో అవస్థలు పడుతున్న వృద్దులు.
Tags: