ఎన్నారై "రాయుడు"కు ఉగాది నంది పురస్కారం.
ఆలమూరు
ఆలమూరు మండలం చెముడు లంక గ్రామానికి చెందిన ఎన్నారై (బెహరాన్)రాయుడు వెంకటేశ్వరరావుకు ప్రతిష్టాత్మకమైన ఉగాది నంది పురస్కారం స్వీకరించారు. పిలాంత్రోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లో జరిగిన ఉగాది జాతీయ నంది పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. బెహరల్లో ఉద్యోగం బాధ్యతలు నిర్వహిస్తున్న రాయుడు వెంకటేశ్వరరావు జన్మభూమి ఉన్న మమకారంతో ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.చెముడు లంక గ్రామంలో తనతో పాటు వివిధ ప్రాంతాలలో స్థిరపడిన ఎన్నారైల సహకారంతో హైస్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్, గ్రామంలో వాటర్ ప్లాంట్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టారు. కరోనా కష్టకాలంలో పేదలకు నిత్యవసర వస్తువులతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో రాయుడు వెంకటేశ్వరరావు తన ప్రత్యేకతను నిలుపుకుంటారు. రాయుడు సేవలను గుర్తించిన పిలాన్ త్రోపిక్ సొసైటీ 2024 ఉగాది నంది పురస్కారానికి ఎంపిక చేసి ఈ అవార్డును అందజేశారు. రాయుడు వెంకటేశ్వర కు ఉగాది నంది పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రెడ్డి, శ్రీ శ్రీ కళాఅకాడమి జాతీయ అధ్యక్షుడు కత్తిమండ ప్రతాప్, కేంద్ర సంగీత నాట్య అకాడమీ చైర్మన్ ఎస్పీ భారతి, పిలాన్త్రోపిక్ పిలాన్తోపిక్ సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజా ల చేతుల మీదుగా స్వీకరించారు. ప్రతిష్టాత్మకమైన ఉగాది నంది పురస్కారాన్ని స్వీకరించిన రాయుడు వెంకటేశ్వరరావును పలువురు అభినందించారు.