ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
By Admin
On
అమలాపురం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ది అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం సత్యవరప్రసాద్ అధ్యక్షతన ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెక్రటరీ కోమ్మూరి వెంకటాచల ప్రసాద్ ట్రెజరర్ దొమ్మేటి సాయిబాబు, చాంబర్ ముఖ్య సలహాదారులు నల్లా పవన్ కుమార్, గోల్డ్ మార్కెట్ అధ్యక్షులు మేడిచర్ల త్రిమూర్తులు, నంద్యాల బాబి వాసిరెడ్డి, సుబ్రహ్మణ్యేశ్వర వలవల శివరావు, ఆకుల నాగేశ్వరావు, ముషిని సత్యనారాయణ,బోర్రా వెంకటేశ్వరరావు, గోకరకోండ బాబులు తదితరులు పాల్గొన్నారు.
Tags: