గోపాలపురం మండలంలో భారీగా నగదు పట్టివేత

గోపాలపురం మండలంలో భారీగా నగదు పట్టివేత

గోపాలపురం

ఎన్నికల సందర్భంగా మండలంలోని జగన్నాధపురం గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతర్ జిల్లాల చెక్పోస్ట్ వద్ద తనిఖీ బృందాలు భారీగా నగదు పట్టుకున్నారు. హైదరాబాదు నుండి రాజమహేంద్రవరం వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో రెండు కోట్ల 40 లక్షల రూపాయలు నగదు తరలిస్తున్నట్లు ఎస్సై కె సతీష్ కుమార్ గురువారం విలేకరులకు తెలిపారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా బస్సులో లగేజీ క్యారియర్లో బ్యాగులతో నగదు ఉంచారన్నారు. తనిఖీ బృందం తనిఖీ చేస్తుండగా నగదు గుర్తించి పట్టుకున్నామన్నారు. ఈ నగదు ఎవరిది అనే విషయాలు తెలియవలసి ఉందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags:

About The Author

Related Posts