స్వచ్చందంగా గ్రామ వాలంటీర్లు రాజీనామా

స్వచ్చందంగా గ్రామ వాలంటీర్లు రాజీనామా

గోకవరం

 మండలంలోని కృష్ణుని  పాలెం గ్రామంలో స్వచ్చందంగా గ్రామ వాలంటీర్లు తమ  వాలంటరీ పదవికి రాజీనామా చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గ వైసిపి అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు తోట నరసింహం, కాకినాడ పార్లమెంటు అభ్యర్థి  చలమలశెట్టి సునీల్ మద్దతుగా ఈ రాజీనామా చేయడం జరుగుతుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో  మళ్ళీ సియం గా  వైయస్ జగన్మోహన్ రెడ్డినీ, జగ్గంపేట నియోజకవర్గ యమ్ ఎల్ ఏ గా మాజీ మంత్రివర్యులు తోట నరసింహం, కాకినాడ పార్లమెంటు యమ్ పి గా చలమలశెట్టి సునీల్ గెలిపించేందుకు మేము అంతా సిద్ధంగా ఉన్నామన్నారు.  ప్రతీ గడపకు ప్రచారం చేసి మా జగనన్నను ముఖ్యమంత్రి ని చేస్తామన్నారు. మా వాలంటీర్స్ అందరూ కలిసి కట్టుగా పనిచేసి  మా వైయస్సార్ పార్టీ  అధికారంలోకి రావడానికి మా వంతు కృషి చేస్తానని చెప్పారు.

Tags:

About The Author