ఇది రాజుగాడి అడ్డా..!

ఇది రాజుగాడి అడ్డా..!

నవరత్నాలదే (ఆ తొమ్మిది మందిదే) దందా అంతా..!
తాడేపల్లిగూడెం సబ్‌ రిజిష్ట్రారు ఆఫీసులో ప్రయివేటు దందా
ఇక్కడ ప్రభుత్వ చలానాతో పాటు రాజుగాడి ట్యాక్స్‌ కట్టాల్సిందే..?
ప్రభుత్వ ఉద్యోగులు కీలుబోమ్మలే.. అందరి లాగిన్‌ కీ లు రాజుగాడి చేతిలోనే..?      

ఎడిటర్‌, పెన్‌పవర్‌ తాడేపపల్లిగూడెం ఆగష్టు 6:  

    తాడేపల్లిగూడెం సబ్‌ రిజిష్ట్రారు ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగులు నలుగురు కాగా ప్రయివేటు వ్యక్తులు తొమ్మిది మంది ఉన్నారు. ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా వారి పనితనం మాత్రం నామమాత్రమే. ఉదయం ఆఫీసుకు రావటం సాయంత్రం ఇంటికి వెళ్ళడం మినహా  పని పైన వారికి  సరిjైున అవగాహన లేకపోవటం, ఇక్కడ అవగాహన లేకపోవడం అనే కంటే నేర్చుకోవాలనే తపన ఆ ప్రభుత్వ ఉద్యోగుల్లో లేకపోవడం అనే చెప్పుకోవాలి... అందు వల్ల  వలన వారు చేసే పని మాత్రం శూన్యం. దానితో ఆఫీసులో ప్రవేటు వ్యక్తులదే హవా కొనసాగుతుంది. ఇదే అదునుగా ప్రయివేటు ధళారీ వ్యావస్థ చాలా కట్టుదిట్టంగా నడుస్తుంది. ఈ వ్యవస్థను ఇంత కట్టుదిట్టంగా నడిపిస్తున్నది మరెవరో కాదు మన రాజుగాడే మనోడే... అసలు ఈ రాజుగాడి కోసం తెలుసుకోవాలంటే ఓ 12 సంవత్సరాలు ముందు కెళ్ధాం...   తాడేపల్లిగూడెంలో అప్పటి సబ్‌ రిజిష్ట్రారు ఆఫీసులో పని చేసేందుకు ఓ ప్రయివేటు వ్యక్తిని నియమించుకున్నారు. రాజు గాడి గా జయిన్‌ అయిన ఆ రాజు నేడు ఆ సబ్‌ రిజిష్ట్రారు ఆఫీసులోనే రాజుగారు అనే స్ధాయి కి  పిలుపు వెళ్లిందటే ఇక్కడ సబ్‌ రిజిష్ట్రారు ఆఫీసులో పరిస్ధితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు..వ్వవస్థను ఈ రాజు ఎంతలా ఏమార్చడంటే తానే సీనియర్‌ ప్రభుత్వ ఉద్యోగిగా అక్కడకొచ్చిన వారందరికీ సుపరిచితుడుగా గుసగుసలు వినిపిస్తున్నాయి...

మరిన్ని వివరాలకోసం  epaperpenpower.in 07-08-2024 ఎడిషన్ చూడండి

About The Author