సరిహద్దు చెక్పోస్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

సరిహద్దు చెక్పోస్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

జీలుగుమిల్లి

ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం నగదు తరలి వెళ్లకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఎస్సిబి అసిస్టెంట్ కమిషనర్ కే విజయ అన్నారు .ఆదివారం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ని ఆమె పరిశీలించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్యం వహిస్తే చర్యలు తప్పవని ఆదేశించారు. సిబ్బందికి పలు సూచనలు ,సలహాలు ఇచ్చారు. ఈమెతో పాటు జంగారెడ్డిగూడెం ఎస్ ఈ బి సీఐ పట్టాభి చౌదరి ,ఎస్సైలు శేఖర్ బాబు, ఎలియేజర్ చెక్ పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author