భారతదేశ ప్రజలందరికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదర్శం

భారతదేశ ప్రజలందరికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదర్శం

జీలుగుమిల్లి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం హక్కులు కల్పించిన మహానుభావుడని పోలవరం నియోజకవర్గం జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి చి రి బాలరాజు అన్నారు .ఆదివారం జీలుగుమిల్లిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి  ఇండియా కూటమి ఏలూరు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య, పోలవరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి దువ్వెల సృజన పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వాడు కాదని అందరివాడు అని అన్నారు. భారత రాజ్యాంగం ఒక వర్గానికి ఉద్దేశించి రాసినది కాదని అందరికోసం అని అన్నారు. విగ్రహానికి పాలాభిషేకం మరియు కేక్ కట్ చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డ మణుగు రవికుమార్ .అంబేద్కర్ యూత్ అధ్యక్షులు తలారి సతీష్. జీలుగుమిల్లి గ్రామ పెద్ద బొంతు వెంకటేశ్వరరావు  అంబేద్కర్ యూత్ మాజీ అధ్యక్షులు బొంతు రవితేజ, ఉపాధ్యక్షులు దేవా లక్ష్మణరావు , కార్యదర్శి మానుకొండ మాధవరావు, ట్రెజరర్ విప్పర్తి దుర్గాప్రసాద్, అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామస్తులు ,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author