గో టి తలంబ్రాలతో భద్రాద్రి కి పాదయాత్ర
By Admin
On
జీలుగుమిల్లి
శ్రీరామ నవమికి కళ్యాణ గో టీ తలంబ్రాలు అక్షంతలుగా అందించటం గత 23 సంవత్సరాలుగా జరుగుతుందని పాదయాత్ర నిర్వాహకులు వే ధుల జనార్ధన రావు అన్నారు. శనివారం జీలుగుమిల్లిలో పాదయాత్ర భక్తులకు స్వాగతం పలికారు. భక్తులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేపట్టారు. తపన ఫౌండేషన్ ద్వారా మొబైల్ ఉచిత వైద్య సేవలు అందించి వాహనం యాత్ర వెంట కొనసాగింది. రామ భక్తులకు మంచినీటి వసతి, మజ్జిగ ను తమ్మన సాంబ ఏర్పాటు చేశారు. పాదయాత్ర చేసే రామభక్తులు 16వ తేదీ రాత్రి కి భద్రాచలం చేరుకొని, 17వ తేదీ శ్రీ రామ కళ్యాణ మహోత్సవంలో ఈ తలంబ్రాలు ఆలయ కమిటీ వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు.
Tags: