గురుకుల పాఠశాలను సందర్శించిన జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి
By G ANIL KUMAR
On
జగ్గంపేటలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శనివారం జగ్గంపేట జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో సమస్యలను ఉపాధ్యాయులు, విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. బెంచీలు, బెడ్స్ కావాలని రమేష్ ను కోరారు. అలాగే కొన్ని సమస్యలు విన్నవించారు. ఈ సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని రమేష్ హామీ ఇచ్చారు.
Tags: