బలహీనవర్గాల ఆశాజ్యోతి పూలే
కాజులూరు
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే మైనార్టీ బీసీ సంఘం నాయకుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు.గురువారం జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని పురష్కరించుకుని ద్రాక్షారామం మసీద్ సెంటర్ లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలు కు ఆయన పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే పాత్ర కీలయం అని ఆయన గుర్తుచేశారు.కుల వ్యవస్తను రూపుమాపేందుకు ఆయన ఎంతో కృషిచేశారన్నారు.చదువుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావుపూలే అని కొనియాడారు.స్త్రీల కోసం విద్యాలయాలను ప్రారంభించిన తొలి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారని గుర్తుచేశారు. అస్పృశ్యతా నిర్మూలనకు ఆయన నిరంతరం శ్రమించారన్నారు. భార్య సావిత్రీ బాయి పూలే తో ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్ధులకు విద్యాభ్యాషం నేర్పించిన మొదటి పంతులమ్మ అన్నారు.పూలే జయంతిని ప్రభుత్వ శెలవు దినంగా ప్రకటించాలని యాట్ల డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కలిదిండి వెంకట సుబ్బారావు,కొసన కామేశ్వరరావు, మేడిశెట్టి శ్రీనివాస్, యాట్ల రోజా రాణి,కె.సంజీవి, కాటే కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.