ప్రళయ కావేరి వేణుగోపాల్ ఆధ్వర్యంలో పసుపులేటి కి ప్రచారం
కావలి
కావలి పట్టణంలో స్వతంత్ర అభ్యర్థి అయిన పీఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పసుపులేటి సుధాకర్ మనసున్న మంచి వ్యక్తి అని సహృదయుడు కావలి నియోజకవర్గంలోని కి కావలి నియోజకవర్గం అభివృద్ధి చేయగల సత్తా ఉన్న వ్యక్తి అని కావలి పట్టణంలో మున్సిపల్ వార్డు 27 ఇన్చార్జి ప్రళయ కావేరి వేణుగోపాల్ తెలిపారు. శనివారం ప్రచారంలో భాగంగా ప్రతి షాపుకి ప్రతి గృహానికి వెళ్లి పసుపులేటి సుధాకర్ ని గెలిపించుకుంటే కావలి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయగలరో గతంలో కరోనా కష్టకాలంలో ఆయన ప్రజలకు చేసిన సేవను, కావలి గ్రామీణ ప్రాంతాలలో మండలాల్లో, మంచినీటి దాతగా ఎంతోమంది ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక సహాయాన్ని అందించిన వ్యక్తి అని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి వ్యక్తిని కావలి నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థి తరఫున కార్యకర్తలు పిఎస్ఆర్ టీం పాల్గొన్నారు.