నిర్లక్ష్యపు నీడలో మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల
ప్రహరీ గోడలు గెంతి విద్యార్థులు బయటకి పోతున్న వైనం..గతం లో పాము కాటుతో విద్యార్థి మృతి
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో ఉన్న మహాత్మా జ్యోతిబాపులే ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరుగుదల సంక్షేమ గురుకుల విద్యాలయం లో విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు మరోసారి బయటపడింది గతంలో ఇదే స్కూల్లో పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు వైద్యం పొందుతూ మృతి చెందారు . దాని అనంతరం స్కూల్ కు ప్రహరీ ఏర్పాటు చేశారు అయినప్పటికీ సిబ్బందిలో ఎటువంటి మార్పు లేదు విద్యార్థులు ప్రహరీ మీద నుంచి జంప్ చేస్తూ బయటికి వెళ్లి వస్తున్నారు, ఏదైనా జరగరానిది జరిగితే దానికి బాధ్యులు ఎవరు అవుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు చుట్టు తుప్పలు, మొక్కలు పూర్తిగా ఉండడం చుట్టూ పాములు తిరుగుతున్నడం ఇక్కడ సాధారణ అయినప్పటికీ నిర్లక్ష్యంగా విద్యార్థులను పట్టించుకోకుండా ఉండటం గమనార్హం.. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని కోరుకుందాం
About The Author
మన్యం జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.