మండల కన్వీనర్ గా సత్తిరెడ్డీ..?
పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 17: పుల్లల చెరువు వైసీపీ మండల కన్వీనర్ పదవికి సత్తిరెడ్డీ పేరు బయటికీ రావడంతో మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ పార్టీ అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ స్థానిక శాసనసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థి పోటీ చేసిన వారి విజయం కోసం వెనకడుగు వేయకుండా తనదైన శైలిలో అతనికి ఉన్న రాజకీయ పలుకుబడితో అన్ని వర్గాల ప్రజల్లో సన్నిహిత నంబంధాలతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విజయాన్ని నల్లేరు పై నడకలాగ పుల్లల చెరువు మండలంలో ముఖ్య పాత్ర పోషించాడు.పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం అభ్యర్థి విజయం కోసం కష్టపడి నీతి నిజాయితీగా కష్ట పడ్డ వ్యక్తీ.పార్టీ ఆవిర్భావం నుంచి ఒక కార్యకర్తగా, నాయకూడగా పార్టీ కోసం కష్టపడి పనిచేసాడు. పార్టీకి విధేయుడుగా ఉంటూ చిన్న పెద్ద తేడాలేకుండా అందరిని కలుపుకు పోతాడన్న పేరు ఉంది.మండలంలో వైసీపీ పార్టీని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు బలోపేతం చేయగల సామర్థ్యం కలిగిన వ్యక్తి సత్తిరెడ్డి.పార్టీ కార్యకర్తలతో, నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకొని పార్టీ అభ్యర్థి విజయం కోసం కష్టపడి పనిచేసే వారిలో సత్తిరెడ్డీ ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. పుల్లల చెరువు మండలం చాపల మడుగు గ్రామపంచాయతీ చెన్నంపల్లి గ్రామ నివాసి రెడ్డి సామాజక వర్గంలో ప్రముఖుడు యువకుడు,ఉత్సాహంతుడు,అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు అధికంగానే ఉన్నాయి. పార్టీ కోసం తన సొంత డబ్బులు ఖర్చు చేసి కార్యకర్తలను ఉత్సాహ పరుస్తూ పార్టీకి వెన్ను దన్నుగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకుపోగాల నాయకుడు సత్తిరెడ్డి.సత్తిరెడీ ప్రస్తుతం చాపల మడుగు సర్పంచ్ గా కొనసాగుతూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు.మండల కన్వీనర్ పదవి ఇలాంటి యువకుడుకి కాక ఇంకెవరికీ ఇచ్చినా వైసీపీ పార్టీ పెద్దలు,పెద్ద పొరపాటు చేసినట్లేనని మండల ప్రజలు భావిస్తున్నారు. సత్తిరెడ్డికి మద్దతుగా మండల నాయకులు,కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. సౌమ్యుడు మృదుస్వభావి స్నేహశీలి అన్నీ వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలున్నాయి. వైసీపీ నాయకులతో, కార్యకర్తలతోను సత్సంబంధాలు ఉన్నాయి. అభిమానులు ఆశీస్సులు, ప్రజాబలం సత్తిరెడ్డికి పుష్కలంగా ఉంది. మండల కన్వీనర్ పదవి సత్తిరెడ్డికి ఇవ్వాలని కార్యకర్తల నుండి డిమాండ్ గట్టిగానే వినబడుతున్నాయి.పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ కులం,మతం ఎలాంటి రాజకీయ భేదం చూడపకుండా ప్రతి ఒక్కరికీ అందుబాటులొ ఉంటూ అందరిని కలుపుకు పోతాడన్నా పేరుంది.తన శక్తి మేరకు వీలైనంతవరకు పార్టీకి, కార్యకర్తలకు ఆర్ధిక ఇబ్బందులు వచ్చిన ముందంజలో ఉంటాడు.కష్టాల్లో కార్యకర్తలకు ఉన్నారని తెలిసిన వెంటనే వారీ అవసరాలు తీర్చడానికి ముందుంటాడు.మండలంలో వర్గ భేదం లేకుండా కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రజాసేవే నా ద్వేయం, మానవసేవయే మాధవసేవ అన్నస్ఫూర్తితో ముందుకెళ్తుంటాడు.పుల్లల చెరువు మండలంలో వైసీపీ పార్టీ బలోపేతం కావాలంటే సత్తిరెడ్డికి మండల కన్వీనర్ పదవి ఇస్తేనే రాబోయే స్థానిక ఎన్నికలలో వైసీపీ విజయం సాధిస్తుందని కార్యకర్తలు, ప్రజలు చెప్పుకుంటున్నారు.