కౌలు రైతులు భూ యజమానులు తో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చు అన్ని రకాల పథకాలకి అర్హులు
గిద్దలూరు పెన్ పవర్ జూలై 18:
గిద్దలూరు మండలంలోని కొత్తకోట, ముండ్లపాడు -1,ముండ్లపాడు-2, కొమ్మునూరు రైతు సేవా కేంద్రాల్లో "పంట సాగు హక్కు పత్రం సి సి ఆర్ సి పై గురువారం గ్రామ సభ నిర్వహించి పలు సలహాలు సూచనలు తెలియజేశారు. గిద్దలూరుసహాయ వ్యవసాయ సంచాలకులు డి.బాలాజీ నాయక్ తెలియజేశారు భూ యజమానులకు ఏ విధంగా ప్రభుత్వం నుంచి పథకాలు అమలు అవుతున్నాయో అదే విధంగా కౌలు రైతులకు అన్ని పథకాలు అమలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంట సాగు హక్కు పత్రాలు ఇస్తున్నామని తెలియజేశారు. ఈ పంట హక్కు పత్రము కాలపరిమితి 11 నెలలు మాత్రమేనని. దీనివలన భూ యజమానులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంట మీద మాత్రమే హక్కు ఉండే విధంగా రూపొందించడం జరిగిందన్నారు, భూమి మీద ఎటువంటి హక్కు ఉండదని,భూ యజమానులు కౌలు కి ఇవ్వడం లో ఎటువంటి అనుమానలు చెందవలసిన అవసరం లేదన్నారు.మండల వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కౌలు కార్డులు తీసుకున్న రైతులు భూ యజమానులు తో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చు అన్ని రకాల పథకాలకి అర్హులని. ముఖ్యంగా పంట నమోదు, పంటల భీమా, పంట నష్ట పరిహారం, కౌలు రుణాలు, ధాన్యం అమ్మకాలు, విత్తనాలు కొనుగోలు మొదలైనవి అన్ని పొందవచ్చునన్నారు.కౌలు కి పొలాలు చేసుకొనే రైతులు భూ యజమాని ఆధార్ కార్డు, పట్టాదారు పాసుబుక్, కౌలు అగ్రిమెంట్, కౌలు దారు ఆధార్ కార్డు, ఫోటో, ఫోన్ నెంబర్ తీసుకొనిగ్రామ రెవిన్యూ అధికారి లేదా గ్రామ వ్యవసాయ సిబ్బందిని కలిసి కౌలు కార్డు పొందవచ్చన్నారు ఈ సందర్భంగా కొందరు రైతులకు కౌలు కార్డులు పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో పోలయ్య, శంకర్,రమణ, గ్రామ వ్యవసాయ,ఉద్యాన సహాయకులు మస్తాన్, రవి, సుష్మిత, కిరణ్మయి కౌలు రైతులు పాల్గొన్నారు.
-------------------------------------------