కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం. పొతుగుంట రాజేష్ నాయుడు.
శ్రీ కాళహస్తి.
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి అన్ని విధాలా సాధ్యపడుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొతుగుంట రాజేష్ నాయుడు స్పష్టం చేశారు. శనివారం నాడు ప్రచారంలో భాగంగా హలో గుడ్ మార్నింగ్ అంటూ డాక్టర్ పోతుగుంట రాజేష్ నాయుడు దిగువ కొనతన్నేరు లో పర్యటించడం జరిగినది. అడుగు అడుగున ప్రజలు ప్రేమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎల్లవేళలా మీ వెంటే మేము ఉంటాం, మార్పు కోసం మీరు వేస్తున్న బాటలో మీకు తోడుగా మేము నడుస్తాం, మీ నాన్నగారి మంచి మనసుని చూశాము, అవినీతి లేని పాలన చూశాము మీకు అండగా తోడుగా ఉంటాము అని ప్రజలు తెలపడం జరిగింది. మంచిని పెంచి,మార్పుని తెచ్చి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని శ్రీ కాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వద్ద నిర్దిష్టమైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ఎటువంటి రాజకీయ విలువలు లేని పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పార్టీల వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉండదన్నారు పేద వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పేద కుటుంబాల మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారని, రైతు కూలీలకు, పేదవారికి రోజుకు 400 వందల రూపాయలు ఉపాధి హామీని కింద ఇవ్వనున్నట్టు తెలిపారు.అదేవిధంగా పేద, బడుగు ,బలహీన వర్గాలకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి వస్తే ఇవన్నీ తూచా తప్పకుండా చేస్తామని తెలిపారు. అలాగే భారత దేశానికే సేవలందించిన కాంగ్రెస్ పార్టీ ని ప్రజలు ఆదరించాలని పొతుగుంట రాజేష్ నాయుడు కోరారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ కాళహస్తి నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ చింతా మొహన్ ను ప్రజలు ఆశీర్వదించి, అండగా నిలవాలని పొతుగుంట రాజేష్ నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.