కోనేటి ఆదిమూలం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న యస్. సి. వి నాయుడు
శ్రీకాళహస్తి
సత్యవేడు నియోజకవర్గం టిడిపి-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు యస్. సి. వి నాయుడు తన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. యస్. సి. వి నాయుడు కి అటు శ్రీకాళహస్తి నియోజకవర్గంతో పాటు, సత్యవేడు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో అనుచర వర్గం ఉంది. ఈ నాలుగు నియోజకవర్గాలలో మంచి ఓటు బ్యాంకింగ్ ఉన్న నాయకులు యస్. సి. వి నాయుడు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సత్యవేడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కోనేటి ఆదిమూలాన్ని గెలిపించుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని తెలిపారు. కుటుంబంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయని, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలని కోరారు. చంద్రబాబు నాయుడు లేనిదే ఈ రాష్ట్ర అభివృద్ధి లేదని, నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి ని చేయకపోతే మనకు, గతి గత్యంతరం లేదని, అందువల్ల తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్య మంత్రిని చేయాలని కోరారు. వైసీపీ పార్టీ ఏర్పడిన ఐదు సంవత్సరాలలో అష్ట దరిద్రాలు, అన్యాయాలను చూసామని ఈ సందర్బంగా అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో శ్రీ సిటీ అద్భుతంగా అభివృద్ధి చెందిందని, ఇంకా అభివృద్ధి చెందాలంటే ఆయన ముఖ్య మంత్రి కావాలని కోరారు. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు హయాంలోనే జన్మభూమి కార్యక్రమం ద్వారా వందల చెరువులు బాగు చేసి, ఉపయోగించుకున్నామని, విపత్కర పరిస్థితులను కూడా ఆ చెరువులు తట్టుకుని నిలబడ్డాయాని, ఆ పనితీరు కేవలం విసనరీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు కే సాధ్యమని అన్నారు. ఇదివరకు సత్యవేడు నియోజకవర్గంలో చిన్న వర్షం పడినా కాటూరు, కడూరు, చీకటి కాలువ మొదలయినవి చాలా ఇబ్బంది పెట్టేవని, విషయం తెలుకున్న తాను అప్పటి మంత్రి శివ ప్రసాద్ తో కలిసి అప్పటి ఆర్ అండ్ బి మంత్రి అయిన విజయరామారావు కి విషయం తెలియజేయగా, కేవలం 24 గంటల్లోనే ఆరు బ్రిడ్జి లకు అనుమతి ఇచ్చారని గుర్తు చేసారు. శనివారం నారా చంద్రబాబు నాయుడు సత్యవేడులో నిర్వహిస్తున్న సభకు భారీ సంఖ్యలో టిడిపి, జనసేన, బీజేపీ పార్టీ ల కార్యకర్తలు, నాయకులు పాల్గొని, సభను విజయవంతం చేయాలనిఅయన కోరారు.