గురక నిద్ర వహిస్తున్న వైద్యులు,
నిన్న మొన్నటి వరకు సంజీవని పెద్ద ఆసుపత్రి
అదేనండి మన కే.జీ.హెచ్
నిద్రమత్తు వీడని వైద్యులతో నిద్రిస్తున్న కే.జి. హెచ్
కూతురిని అల్లుడిని చూడ్డానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో అందని లోకాలకు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ
కే.జీ.హెచ్.లో చికిత్స పొందుతూ మృతి
విశాఖ సిటీ, పెన్ పవర్, ఆగస్టు 13 :
జీ.వీ.ఎం.సీ.పరిధి కంచరపాలం జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున ఐదున్నర గంటల సమయం లో రోడ్డు ప్రమాదం జరిగింది, ప్రమాదంలో గాయపడిన మహిళను స్థానికులు సహాయంతో 108 అంబులెన్స్ లో కే.జీ.హెచ్ హాస్పిటల్ లో జాయిన్ చేశామని తెలియజేశారు. సకాలంలో వైద్యులు వైద్యం చేయక పోవడం వల్ల గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిందని బంధు వులు ఆరోపిస్తున్నారు. మృతురాలు అప్పియ మ్మ (35) తన కూతురిని అల్లుడిని చూసే నిమిత్తం కంచరపాలెం వెళ్లడం జరిగింది తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగి అనంత లోకాలకు చేరిందని బంధువులు ఆర్తనాదాలు వెల్లువెత్తారు. ఈ మేరకు ఇదే అంశంపై ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సి.ఐ ప్రసాదరావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎలక్ట్రిక్ కారు నెంబర్ ఏ.పీ.39.యు.డబ్ల్యూ 9359 జాతీయ రహదారిపై గోపాలపట్నంలో నుంచి వయా ఎన్ ఏ.డి. పైగా జాతీయ రహదా రి పై ప్రయాణిస్తున్న కారు కంచరపాలెం హైవే పై ప్రయాణిస్తుండగా అప్పియమ్మ (35)తన కూతు రిని అల్లుడిని చూసే నిమిత్తం కంచరపాలెం వెళ్లడం జరిగింది తిరుగు ప్రయాణంలో అప్పియ మ్మను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిం ది,వెంటనే కారు డ్రైవర్ ట్రాఫిక్ సిబ్బంది కి కారుని అప్ప జెప్పి డ్రైవర్ లొంగిపోయాడని ట్రాఫిక్ సి.ఐ తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు. బంధువులు ఆరోపణ మరోలా ఉన్నాయి,ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ లో తీసుకెళ్తున్నప్పుడు మృతు రాలు పల్స్ రేట్ మరియు హార్ట్ బీట్ కరెక్ట్ గా ఉన్నాయని 108 సిబ్బంది తెలియ జేశారని మృతురాలు సోదరుడు గిరి (విశాఖ- పశ్చిమ) ఆంధ్రజ్యోతి పత్రిక పాత్రికేయులు తెలియ జేశారు. హాస్పిటల్ కి వచ్చిన తర్వాత కూడా మాతో సంభాషించడం జరిగిందని సకాలంలో వైద్యం అంది ఉంటే తన సోదరి చనిపోయి ఉండేది కాదు అని ఆయన తెలిపారు. ఈ ఘటన పై సూపిరిడెంటెంట్ డాక్టర్ పి.శివానంద్ కి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగిందని, మొద్దు నిద్ర వహిస్తున్న వైద్యులపై తగిన చర్య తీసుకో వాలని పేదల పెన్నిధి మూడు జిల్లాల సంజీవని లాంటి ధర్మాసుపత్రి అని ఇలాంటి ఆసుపత్రిలో అనునిత్యం వైద్యులు సేవలు అందుబాటులో ఉండాలి, ఇటువంటి మరణాలు పునరావృతం కాకుండా,వైద్యుల పై దృష్టి సారించి పై కఠిన మైన చర్యలు తీసుకోవాలని ఆయన్ని కోరామ ని మృతురాలి సోదరుడు తెలియజేశారు. పోస్టుమార్టం అనంతరం మృతి దేహాన్ని బంధు వులకి అందజేశారు.
About The Author
సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.